![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'ఇల్లు ఇల్లాలు పిల్లలు '(Illu Illalu Pillalu). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్ -455 లో.. నా పెద్ద కోడలు కడుపులో పెరుగుతున్న పాప బాగుండాలి.. ఇకనైనా అందరు సంతోషంగా ఉండాలని రామరాజు మొక్కుకుంటాడు. అప్పుడే రామరాజుకి వల్లి గురించి నిజం చెప్పాలని చందు వస్తుంటే తనని లాక్కొని గదిలోకి వెళ్లి అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్ధం అవుతుందా అని వేదవతి అడుగుతుంది. నీకు తన గురించి ఏం తెలియదు అమ్మ అని చందు అనగానే నాకు వల్లి గురించి తెలుసని వేదవతి అంటుంది. దాంతో చందు షాక్ అవుతాడు.
నాకు శ్రీవల్లి వాళ్ళ అమ్మ వాళ్ళు చేసిన కుట్రల గురించి తెలుసు.. నీకు శ్రీవల్లి గురించి తెలిసినప్పుడు ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లి తనని తన పుట్టింట్లో వదిలేసి వచ్చావ్ ఎందుకని వేదవతి అడుగుతుంది. తన కుటుంబ గౌరవం కాపాడే కోడలు దొరికిందని నాన్న మురిసిపోతున్నాడు.. నిజం తెలిస్తే నాన్న తట్టుకోలేడని అందుకే చెప్పలేదని చందు అంటాడు. మరి ఇప్పుడు చెప్తే తట్టుకుంటాడా అని వేదవతి అడుగుతుంది. అవును రా పెద్దోడ ఇప్పుడు వదినని మంచిగా మార్చుకోవడానికి ట్రై చెయ్ అని ధీరజ్ అంటాడు. అవును వల్లి గురించి నీకెలా తెలుసురా అని ధీరజ్ ని వేదవతి అడుగుతుంది. మాక్కూడా తెలుసని ప్రేమ, నర్మద ఎంట్రీ ఇస్తారు. ఇక మీదట శ్రీవల్లి తోక జాడించకుండా వార్నింగ్ ఇచ్చే తీసుకొని వచ్చానని వేదవతి చెప్తుంది.
భాగ్యం వాళ్ళ ఇంటికి వెళ్లి భాగ్యం చెంప చెల్లుమనిపిస్తుంది వేదవతి. అందరికి వార్నింగ్ ఇచ్చి వచ్చినట్లు ప్రేమ, నర్మద వాళ్ళకి వేదవతి చెప్తుంది. మరొకవైపు శ్రీవల్లి, భాగ్యం ఆనందరావు ముగ్గురు మళ్ళీ ఇంట్లోకి అడుగుపెట్టినం అని డాన్స్ చేస్తారు. మళ్ళీ ఈ కుటుంబం నీ మాట మీదే నడవాలి అంటూ వల్లికి భాగ్యం చెప్తుంటే.. ప్రేమ, నర్మద వచ్చి ఇక మీరు మారారు అని అంటారు. ధీరజ్ వచ్చి వదిన మీరు ఇక మీదట తప్పు చేస్తే మళ్ళీ ఇంట్లో ఎవరు క్షమించరని వల్లి తో ధీరజ్ చెప్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |